సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా మే9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా..అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈచిత్రం లోని రెండు పాటలను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పాటలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవాలి.
ఇక సినిమా తర్వాత మహేశ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన నాలుగు సినిమాలు హిట్ సాధించడంతో ఆయన టాప్ దర్శకులలో ఒకరుగా ఉన్నారు. అయితే మహేశ్ బాబు సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే మరి. అక్షరాల రూ.9కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట అనిల్ రావిపూడి.
ఇంతకుముందు వరకు ఈ దర్శకుడు ఒక్కొ సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకునేవాడు..కానీ ఇప్పడు రేంజ్ పెరిగిపోవడంతో దానికి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. మహర్షి మూవీ విడుదల తర్వాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.