ఆ సినిమాలు దిల్ రాజుకు నష్టాలు పూడుస్తాయా..?

206
dil raju bags jaya janaki nayaka
- Advertisement -

మధ్య మధ్యలో దిల్ రాజు సినిమాలు కొన్ని తేడా కొట్టేసి ఉండొచ్చు. ప్రతి వ్యాపారంలో మాదిరిగానే సినిమా బిజినెస్ లోను లాభనష్టాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివాటిలో పండిపోయిన వ్యక్తిగా దిల్ రాజు కనిపిస్తుంటాడు. ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా ఆయనకి నష్టాన్నే మిగిల్చింది. అయితే నిర్మాతగా ఆయనకు ‘శతమానం భవతి’ .. ‘దువ్వాడ జగన్నాథమ్’ .. ‘ఫిదా’ సినిమాలు లాభాలనే తెచ్చిపెట్టాయి.  ఆయనో కథను నమ్మారంటే అందులో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని.. ఆయనో సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడారంటే.. అందులో కంటెంట్ ఉంటుందని.. తన బేనర్ నుంచి ఏదైనా సినిమాను రిలీజ్ చేశారంటే కచ్చితంగా అది బాగుంటుందని జనాల్లో ఓ భరోసా ఉంది.

అలాంటి దిల్ రాజుకి ‘గౌతమ్ నంద’ .. ‘దర్శకుడు’ సినిమాలు నష్టాలనే తెచ్చిపెట్టాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 11న రానున్న ‘జయ జానకి నాయక’ సినిమాను ఆయనే విడుదల చేస్తున్నాడు. ఇక ‘లై’ సినిమాకి సంబంధించి నైజామ్ వరకూ కొంత వాటా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలైనా నష్టాన్ని పూడుస్తాయేమో చూడాలి. నిర్మాతగా లాభాలు సాధిస్తోన్న ఆయన .. డిస్ట్రిబ్యూషన్ లో నష్టాలు ఎదుర్కుంటూ ఉండటం ఆశ్చర్యం.

- Advertisement -