వారిద్దరితోనే రేవంత్‌కు ముప్పు:ధర్మపురి

19
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తలుచుకుంటే రేవంత్ సర్కార్ కూలి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ రోడ్‌షోలో మాట్లాడిన అరవింద్..కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని మండిపడ్డారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందుకు మన పనులు కావట్లేదని వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీ పతనావస్థకు చేరిందన్నారు. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పారు. అవినీతిచేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్పా.. తప్పు చేయనని తెలిపారు. తనపై ఒక్క అవినీతి మరక లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌ ఏడాదిలోపే తెరచుకోవచ్చని తెలిపారు.

Also Read:Rahul:ఆర్టీసీ బస్సులో రాహుల్‌తో సీఎం రేవంత్‌

- Advertisement -