‘అసురన్‌’గా ఆకట్టుకుంటున్న ధ‌నుష్..

273
Asuran

తమిళ హీరో ధ‌నుష్ చివ‌రిగా మారి 2 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. ఈ చిత్రం పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది . ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అసుర‌న్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.

ఈ మూవీ నుండి ప్రస్తుతం బయటికి వచ్చిన ధనుశ్ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. పెరిగిన గెడ్డం .. మీసాలు .. తలపాగా .. పంచకట్టు .. పాత చొక్కాతో పల్లెటూరి మొరటు మనిషిగా ధ‌నుష్ మాస్ లుక్‌తో కనిపిస్తున్నాడు. జాతర నేపథ్యంలో ఎవరినో నరికినట్టుగా చేతిలో కత్తితో .. చొక్కాపై రక్తంతో ఆయన ఆవేశంతో వున్నాడు. చివరి షెడ్యూల్ మొదలైందంటూ ధ‌నుష్ పోస్ట్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రీ కొడుకులుగా ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.