ఆగస్ట్ నుంచి కొరటాల తో చిరంజీవి..

181
chiru koratala

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. భారీ బ్జెడెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించగా.. తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది.

ఆగస్ట్ లో ఈమూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న కొరటాల శివ ఆగస్ట్ లో ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించాలని భావిస్తున్నాడట. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు.

ఇప్పటికే సైరా మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తి కావడంతో ఈసినిమాను కూడా ప్రారంభించాలని చూస్తున్నారట. ఈచిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. అనసూయ కోసం మంచి స్క్రీప్ట్ ను రెడీ చేశాడట దర్శకుడు కొరటాల. సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.