దనుష్ అతిథిగా సెల్ఫీష్ మూవీ ప్రారంభం..

61
dhanush
- Advertisement -

అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి అతిథిగా హాజరయ్యారు హీరో ధనుష్. ఈ సినిమాకు సెల్ఫీష్ అనే టైటిల్ ఖరారు చేయగా అన్నపూర్ణ స్టూడియోలో అధికారికంగా సినిమా ప్రారంభమైంది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత సుకుమార్‌తో కలిసి సినిమా చేస్తున్నారు దిల్ రాజు. ఆర్యతో ఇండస్ట్రీకి సుకుమార్‌ను లాంఛ్ చేశారు దిల్ రాజు. అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ కూడా ఈ సినిమా ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు.

ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక మూవీలో ఆశిష్ కు జోడిగా శ్రీలీల కనిపించబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ “సెల్ఫిష్” చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.

- Advertisement -