ధ‌నుష్ ‘అసురన్’ ఫస్టులుక్..

250
- Advertisement -

ధనుశ్ కథానాయకుడిగా తమిళంలో ‘అసురన్’ సినిమా తెరకెక్కుతోంది. వెట్రి మారన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, తాజాగా ఫస్టులుక్‌ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ఫస్టులుక్ పోస్టర్‌లో ధనుశ్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు.

Dhanush

ఇందులో గ‌ళ్ళ లుంగీ పైకి క‌ట్టి బ‌ల్లెంతో దాడికి దిగుతున్న‌ట్టుగా ఉన్న ధ‌నుష్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. నేటి నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. కథానాయిక‌గా మ‌ల‌యాళ భామ మంజు వారియ‌ర్‌ని ఎంపిక చేశారు.

- Advertisement -