ధమాకా బ్యూటీ పెంచేసిందట

58
- Advertisement -

ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ధమాకా తో శ్రీ లీల స్టార్ హీరోయిన్ అయిపోయింది. రాఘవేంద్ర రావు తీసిన ‘పెళ్లి సందడి’ తో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ కోసమే ధమాకా పదే పదే చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా శ్రీ లీల డాన్సులకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ధమాకా లో సాంగ్స్ విజువల్స్ గా ఎట్రాక్ట్ చేశాయంటే అందులో ఈ బ్యూటీ పాత్రే ఎక్కువ ఉంది.

పెళ్లి సందడి సినిమాకి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీ లీల ఇప్పుడు ధమాకా దెబ్బతో రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. ధమాకా సినిమాకి అమ్మడు కోటి లోపే రెమ్యూనరేషన్ అందుకుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ తో తన రెమ్యూనరషన్ రెండు కోట్లకి పెంచేసిందని ఇన్ సైడ్ న్యూస్ ద్వారా తెలుస్తుంది.

శ్రీ లీల చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. బాలయ్య తో ఓ సినిమా, మహేష్ బాబు తో మరో సినిమా చేస్తుంది. ఇవి కాకుండా రామ్ బోయపాటి సినిమా ఉండనే ఉంది. నవీన్ పోలిశెట్టి , నితిన్ లతో మరో రెండు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ ఏం వచ్చినా రెండు కోట్ల వరకూ అందుకునే ఆలోచనలో ఉందట. ఏదేమైనా డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకోవాలనే సూత్రం పాటిస్తున్నట్టుంది శ్రీ లీల.

ఇవి కూడా చదవండి..

- Advertisement -