ఆరుశాతం తగ్గిన నేరాలు: డీజీపీ మహేందర్ రెడ్డి

132
dgp
- Advertisement -

తెలంగాణలో నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. నేర, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ..రాష్ట్రంలోకి మావోయిస్టుల పునః ప్రవేశాన్ని సమష్టి కృషితో అడ్డుకున్నామని తెలిపారు.

తెలంగాణలో రాష్ట్ర కమిటీ ఉండాలన్న మావోయిస్ట్‌ సెంట్రల్‌ కమిటీ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందన్నారు. ఇంటర్‌ స్టేట్‌ బార్డర్‌, డిస్ట్రిక్ట్‌ గార్డ్స్‌, గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐవీ, జిల్లా పోలీసులు నిరంతర ఆపరేషన్లతో వారిని అడ్డుకున్నారన్నారు.

డయల్‌ 100, డయల్‌ 112 ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని, ఫిర్యాదు వచ్చిన ఎనిమిది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ సేవలు అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు, మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతా పీపుల్స్‌ ఫ్రెండ్లీ, స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానం తీసుకువచ్చి ప్రజలకు మరింత చేరువైనట్లు చెప్పారు.

- Advertisement -