రజనీ గొప్ప నాయకుడు : బీజేపీ నేత సీటీ రవి

28
tamil

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు బీజేపీ నేత,తమిళనాడు ఇంచార్జీ సీటీ రవి. మీడియాతో మాట్లాడిన ఆయన ర‌జినీకాంత్ గొప్ప నాయ‌కుడ‌ని కొనియాడారు. ర‌జినీ ఎప్పుడు దేశ ప్ర‌యోజ‌నాలను, త‌మిళనాడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టం కోసం కృషిచేశార‌ని వెల్లడించారు. రజనీ అంటే తమకు ఎప్పటికీ గౌరవమేనన్నారు.

మరికొద్దిరోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనుండగా పార్టీ పెట్టి అన్ని స్ధానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు రజనీ. అయితే అనుకోకుండా తీవ్ర అస్వ‌స్థ‌తకు గురైన ఆయన తన మనసు మార్చుకున్నారు. అనారోగ్య కార‌ణాల రీత్యా తాను రాజ‌కీయాల్లోకి రావ‌డంలేద‌ని ప్ర‌క‌టించారు.