కరోనా చికిత్సలో ఉపయోగించే మరో ఔషధానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది.సాధారణ నుంచి తీవ్రమైన రోగులకు సహాయక చికిత్సకు 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-DG) మెడిసిన్ కు అనుమతిచ్చింది. ఈ మెడిసిన్ సులభంగా ఉత్పత్తి, పుష్కలంగా అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపింది డిఆర్డీవో.
మెడిసిన్ ను సంయుక్తంగా అభివృద్ధి చేసింది డిఆర్డీవో కి చెందిన న్యూక్లియర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్యారేటరీస్.ఇప్పటికే మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తికాగా క్లినికల్ ట్రయల్స్ లో ఈ మెడిసిన్ ఆసుపత్రిలో చేరిన రోగులను వేగంగా కోలుకోవడానికి సహాయం చేస్తోందని వెల్లడించింది డిఆర్డీవో.
రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని కూడా తగ్గిస్తుందని తెలినట్లు స్పష్టం చేసింది. ప్రామాణిక చికిత్స తో పోలిస్తే 2డిజి మెడిసిన్ తీసుకున్నవారు త్వరగా కొలుకున్నారని తెలిపింది డిఆర్డీవో సంస్థ. 2డిజి మెడిసిన్ తో చికిత్స పొందిన రోగులలో ఎక్కువ శాతం మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు వెల్లడించింది.
2డిజి మెడిసిన్ సాచేట్ లో పొడి రూపంలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీనిని నీటిలో కరిగించి.. నోటి ద్వారా తీసుకుంటారని తెలిపిన డిఆర్డీవో….ఇది వైరస్ సోకిన కణాలలో పేరుకుపోయి.. వైరల్ సంశ్లేషణ, శక్తి ఉత్పత్తిని ఆపడం ద్వారా వైరస్ పెరుగుదలను నిరోధిస్తుందని వెల్లడించింది.