డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించిన యాక్సిస్..!

107
axis

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్..సవరించిన కొత్త రేట్ల మే 6 నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్ డీ కస్టమర్లకు 2.5 శాతం నుంచి 5.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అయితే ఇవి సాధారణ కస్టమర్లకు కూడా వర్తిస్తాయి.

కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుండి 14 రోజుల వరకు: 2.50% వడ్డీ ఉండనుండగా 15 రోజుల నుండి 29 రోజుల వరకు: 2.50%,30 రోజుల నుండి 45 రోజుల వరకు: 3%,46 రోజుల నుండి 60 రోజుల వరకు: 3% వడ్డీ ఉండనుంది. గరిష్టంగా 5.75 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.