వర్మ చెక్కిన దేవినేని..

1195
Vangaveeti
- Advertisement -

నటుడి టాలెంట్‌ ను వెలికితీయడంలో డైరెక్టర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేసుకోవడం దగ్గరనుంచి..ఆ నటుడి నుంచి తనకు కావాల్సిన పర్ఫామెన్స్‌ ను రాబట్టుకోవడంలో డైరెక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మిగతా డైరెక్టర్ సంగతి పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ మాత్రం దిట్ట. ఎలాంటి నటుడైనా సరే.. వర్మ చేతిలో పడ్డాక సరికొత్తగా తయారవుతాడు. మామూలుగా కనిపించే వ్యక్తుల్ని కూడా తన పాత్రలకు తగ్గట్లు మలుచుకోవడంలో వర్మ ది అందవేసిన చేయిగా చెప్పుకోవచ్చు. ఇలా తన సినిమాల ద్వారా చాలామందికి మేకోవర్ ఇచ్చాడు వర్మ.

Vangaveeti

విజయవాడ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రాడ్‌ లో తెరకెక్కి..రిలీజ్ కు సిద్ధమవుతున్న ‘వంగవీటి’ సినిమాలో కూడా నటీనటుల ఎంపిక వర్మ చాలా జాగ్రత్తపడ్డాడు. రియల్ క్యారెక్టర్స్‌కు పోలికల్లో దగ్గరగా ఉన్న వ్యక్తులనే తెరపై చూపించబోతున్నాడు. సినిమాలో లీడ్ క్యారెక్టర్ అయిన వంగవీటి రంగా పాత్రను కూడా సేమ్ టు సేమ్ వ్యక్తినే తీసుకువచ్చాడు. రియల్‌ గా వంగవీటి రంగాను పోలినట్టే ఉంది ఆ పాత్ర. ఇప్పుడు వంగవీటిలో కీలకమైన దేవినేని నెహ్రూ పాత్రలో నటించిన ఆర్టిస్టుని వర్మ పరిచయం చేశాడు. అతడి పేరు.. శ్రీతేజ్. ముంబయి నుంచి ఈ నటుడిని పట్టుకొచ్చినట్లున్నాడు వర్మ.

దేవినేని నెహ్రూ ఫొటోను.. శ్రీతేజ్ ఫొటోను మామూలుగా పెట్టి చూస్తే పోలికలు పెద్దగా కనిపించవేమో కానీ.. వర్మ మేకోవర్ తర్వాత మాత్రం అచ్చం దేవినేని లాగే కనిపిస్తున్నాడు శ్రీతేజ్. పైగా దేవినేని తరహాలో అతడిచ్చిన ఎక్స్ ప్రెషన్ చూస్తే షాకవ్వాల్సిందే. కొన్ని నెలల పాటు దేవినేని నెహ్రూ హావభావాల్ని.. బాడీ లాంగ్వేజ్ ను స్టడీ చేసి శ్రీతేజ్ ఆ తర్వాతే ఈ పాత్ర చేశాడని చెబుతున్నాడు వర్మ. నెహ్రూ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చినట్లు కూడా చెప్పాడు. ‘వంగవీటి’ విడుదలకు సమయం దగ్గర పడుతుండగా.. వివాదాస్పద నేత అయిన దేవినేని నెహ్రూ పాత్రను పరిచయం చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ నెల 23నే ‘వంగవీటి’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రారంభంతోనే వివాదాలకు తెర తీసిన ఈ సినిమా రిలీజైన తర్వాత ఇంకెంత వివాదం సృష్టిస్తుందో చూడాలి.

Vangaveeti

- Advertisement -