వర్మ వంగవీటికీ ‘నో’ కట్‌….

304
Vangaveeti censor completed
- Advertisement -

సంచలనల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వంగవీటి సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రోజు వార్తలోనే నిలుస్తుంది. తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అని వర్మకూడా వస్తున్న న్యూస్‌ను చాలా ఎంకరేజ్‌ చేశాడు. వంగవీటి ఆడియో రిలీజ్‌ రోజున వంగవీటి రాధతో వర్మమీటింగ్ ఆతర్వాత గ్రాండ్‌గా ఆడియో జరగడం ఇదంతా ఈ సినిమాకు ఉహించని క్రేజ్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం వర్మ ఈనెల 23న వంగవీటి సినిమా రిలీజ్‌కు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

అయితే వంగవీటి సినిమాకు సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ కూడా పూర్తి చేసుకుంది. అనుకున్నట్లుగానే వంగవీటికి “ఏ” సర్టిఫికెట్‌ వచ్చింది. కానీ సినిమాలో రెండు మూడు డైలగ్స్‌కు మాత్రమే కట్‌లుపడ్డాయట. మొదట్లో ఈ సినిమాకు సెన్సార్‌ నో చెప్పెఅవకాశలు చాలానే ఉన్నాయని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వంగవీటి సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో ఒక్కింత ఆశ్చరకలిగదనే చెప్పవచ్చు.

Vangaveeti censor completed

విజయవాడలో గతంలో జరిగిన రౌడియిజం మీద తీసిన కథే వంగవీటి. రాంగోపాల్‌ వర్మ బాగా కాన్సెంట్రేట్ చేసి తీసిన సినిమా వంగవీటి. కేవలం సినిమాలో రెండు కుటుంబాల మధ్య విభేదాలని కాకుండా.. రెండు కులాల మధ్య ( కమ్మ వర్సెస్‌ కాపు కులాల మధ్య) జరిగిన కథ అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అలానే ఈ సినిమాలో తీర్చిదిద్దాడట. సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వంగవీటి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వెచిచూడాల్సిందే మరి.

Vangaveeti censor completed

గతంలో రాంగోపాల్‌ వర్మ జేమ్స్ బాండ్ ‘స్పెక్టర్’ సెన్సార్ కట్ లపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో జేమ్స్ బాండ్ సినిమాపై సెన్సార్ సూచించిన కట్ లపై అభ్యంతరం చెప్పిన వర్మ….. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా ప్రేక్షకులను వేలి ముద్రలు వేసే వాళ్లుగా చూస్తోందని వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

ఏం చూడాలో, ఏం చూడకూడదో నిర్ణయించుకుని, ఆలోచించుకునే ప్రేక్షకులను గుర్తించాలని కోరాడు. సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే వివేచన ఉన్నప్పుడు ఏ సినిమా చూడాలో నిర్ణయించుకోలేరా? ప్రభుత్వాలు జనాల ఆలోచన స్థాయిని గౌరవించి.. ఇలాంటి సెన్సార్ కటింగులకు ముగింపు పలకాలని.. ఓ సినిమా చూడాలా వద్దా అన్నది జనాలే నిర్ణయించుకుంటారని వర్మ సెన్సార్‌పై విమర్శల చేశాడు. గతంలో ఈవిధంగా సెన్సార్‌ వాళ్లని ఆటడేసుకున్నందుకే వంగవీటికి “ఏ” సర్టిఫికెట్‌ వచ్చిందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -