వాల్తేరు.. మెగా ట్రీట్ ఖాయమట!

90
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఫస్ట్ సింగిల్ సాంగ్ అదిరిపోయే విధంగా రాబోతుందని, బాస్ పార్టీ మామూలుగా ఉండదని తెలిపారు. ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ పక్కా మాస్ సాంగ్‌గా ఉండబోతుండగా, ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్ పక్కన చిందులు వేయనుందట.

దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టైటిల్ మోషన్ పోస్టర్‌లు అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి ఫస్ట్ సింగిల్‌తో చిరు ఏం మాయ చేస్తాడో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -