సెల్ ఫోన్ మనిషి నిత్యజీవితంలో భాగస్వామ్యమై పోయింది. పేద, ధనిక తేడాలేదు..అంతా సెల్‌ఫోన్‌కు అట్రాక్ట్ అవుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి మొదలు రాత్రి పడుకునే దగ్గరి వరకు…సారీ సారీ పడుకున్నా పక్కనే ఉండాల్సి వస్తువుగా మారిపోయింది. కుటుంబం, బంధాలు లేకున్నా పర్వాలేదు గానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అందుకు కొంతమంది బాత్రూమ్‌కు వెళ్లిన ఫోన్‌ను వదిలిపెట్టడం లేదు.
అయితే ఈ అలవాట్లు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. స్త్రీ, పురుషులు ఇద్దరికి మొబైల్ ఫోన్లు ప్రమాదమేని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా మగవాళ్లలో అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్లూ కిరణాల కారణంగా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్య వస్తుందని చెబుతున్నారు.
ఇక ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మెదడు క్యాన్సర్ వస్తుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచి నిద్రపోవాలని చెబుతున్నారు. ఫోన్ పక్కనే ఉంచి నిద్రపోవడం వల్ల..ఉదయం మూడీగా, అలసిపోయినట్టు, డిస్టర్బ్‌గా లేస్తూ ఉంటారు. నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, స్థూలకాయం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్ఆరు. కాబట్టి రాత్రి పడుకునే ముందు పక్కనే ఫోన్ పెట్టుకుంటున్న వారంతా జాగ్రత్త.
ఇవి కూడా చదవండి..

