విశాఖలో దేవర!

20
- Advertisement -

మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కీ రోల్‌ చేస్తున్నారు.రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు వార్ 2 లో బిజీగా తారక్ ఉండగా దేవర షూట్ ని విశాఖపట్నం లో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ షూట్ అంతా ఎన్టీఆర్ లేకుండా తీసే సన్నివేశాలు అన్నట్లు తెలుస్తోంది. ఇవి సేఫ్ సైడ్ గా తీస్తున్నట్లు సమాచారం.

Also Read:TTD:టీటీడీ అందిస్తున్నసేవ‌లు భేష్‌

- Advertisement -