దేశంలోనే నెంబర్‌వన్..కేజీ టూ పీజీ

44
- Advertisement -

మనుషులకు అత్యంత విలువైన సంపద కేవలం విద్య అని…ఇది మన నుంచి దొంగలించలేని ఒక అపురూపమైన వస్తువని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇతర స్థానికి ప్రజాప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లాసులన్నీ కలియ తిరుగుతూ క్యాంపస్‌ యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 2004లోనే కేజీ టూ పీజీ క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ చెప్పారని నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యకు పెద్దపీట వేశామన్నారు. మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను స్థాపించమని తెలిపారు. గురుకుల విద్యార్థుల‌కు సంబంధించి ఒక్కొక్క‌రిపై రూ. ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు పెడుతున్నాం.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌న ఊరు – మ‌న బ‌డి పేరిట రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల‌ను మూడు ద‌శ‌ల్లో అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ పుట్టి ఎనిమిదిన్న‌రేండ్లు అవుతుంది. 75 ఏండ్ల స్వ‌తంత్య్ర భార‌త‌దేశంలో ఏ రాష్ట్రంలో జ‌ర‌గ‌ని అభివృద్ధి, సంక్షేమాన్ని తెలంగాణ‌లో తీసుకుపోతున్నాం. ఈ ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్‌ను మ‌నం గుర్తు చేసుకోవాలి. ఆయ‌న పేరిట ఇప్ప‌టికే ఆచార్య ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం అని పెట్టుకున్నాం. ఈ పాఠ‌శాల‌కు ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ పేరు పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని కేటీఆర్ సూచించారు.

ఈసందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ… దేశంలోనే ఎక్కడాలేని విధంగా కేజీ టూ పీజీ క్యాంపస్‌ మన గంభీరావుపేటలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. నాటి ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 12కాంపోనెంట్‌లతోప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం కింద రూ.7300కోట్లతో 26వేల స్కూల్‌లను 3విడతలలో అభివృద్ధి చేస్తున్నామని…ఇందంత సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశంతో చేస్తున్నామని అన్నారు. తొలి విడతలో భాగంగా రూ. 3509 కోట్లతో 9వేల పాఠశాల అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నామని…ఇప్పటివరకు 5వేల మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

కేజీ టూ పీజీ లాంటి మరిన్ని క్యాంపస్‌లు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేజీ టూ పీజీ క్యాంపస్‌ నిర్మాణంకు తోడ్పాటు అందించిన రహెజా, దివిస్ ల్యాబరేటరీ, గివ్ తెలంగాణ, ఎంఆర్ఎఫ్ ప్రతినిధులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు.

ఇవి కూడా చదవండి…

తెలంగాణలో నిధుల వరద ఏమైంది..?

పీఎం కేర్స్..కేంద్రంపై కేటీఆర్ ఆసహనం

కార్పొరేట్ స్థాయిలో సర్కార్ స్కూళ్‌…

- Advertisement -