కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశఅర్థికాభివృద్ది కంటే రాజకీయాల కోసమే నిధులు కేటాయించినట్టు ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ డీకోడ్ ది ఫ్యూచర్ అనే ఆంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… దేశ ఆర్థికాబివృద్ధి కోసం నిధులు కేటాయించినట్టు లేవని మండిపడ్డారు. మానవ వనరులు పుష్కలంగా ఉన్న మనదేశంలో యువత కోసం అరకోర నిధులు కేటాయించారన్నారు.
సింగపూర్ కంటే మన హైదరాబాద్ పెద్దగా ఉంటుందన్నారు. అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తుందని తెలిపారు. గత ఎనిమిండేండ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ…దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతంగా నమోదైందన్నారు. దీంతో తెలంగాణ 4.6ట్రిలియన్ ఎకానమీకి చేరుకుందన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
టీఎస్ఐపాస్ ద్వారా కేవలం 15రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అంతేకాదు 15రోజులు దాటితే సంబంధిత అధికారి నుంచి రోజుకు ఒక వెయ్యి చొప్పున ఫెనాల్టీ వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు హైదరాబాద్‌లో తమ రెండవ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1/3వ వంతు వ్యాక్సిన్లు మన హైదరాబాద్ నుంచే ఉత్పత్తి జరుగుతుందన్ని తద్వారా గ్లోబల్ వ్యాక్సిన్ సెంటర్‌గా హైదరాబాద్ నిలిచిందన్నారు.
ఇవి కూడా చదవండి…