డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ అరెస్టైన నాటి నుంచి రోజుకో కథనం వెలుగు చూస్తోంది. ఇద్దరిపై రేప్ చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. గతంలో ఎందరినో రేప్ చేశాడని బాబా బాడీగార్డ్ వెల్లడించగా, మొన్న డేరా బాబా గుహలో వయగ్రా ప్యాకెట్లు రాఖీసావంత్ చూశానని చెప్పిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆయన బంధువు భూపిందర్ సింగ్ గోరా మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. డేరా ఆశ్రమంలో ఉన్న మహిళా భక్తులను, హై ఫ్రొపైల్ మోడల్స్, ఆశ్రమానికి వచ్చిన సినీ నటీమణులను బెదిరించి మరీ గుర్మీత్ అత్యాచారానికి పాల్పడేవాడని , హైప్రొఫైల్ మోడల్స్ ను సిర్సా లేదా ముంబై తీసుకెళ్లి 15 నుంచి 20 రోజులపాటు ఎంజాయ్ చేసేవాడని అన్నారు. మహిళా భక్తులతో వ్యభిచారం గురించే బహిరంగంగా మాట్లాడేవాడని, ఒక్కో రోజు ఒకరితో గడిపేవాడని చెప్పారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కితే ప్రాణం తీస్తానని హెచ్చరించేవాడని ఆయన తెలిపారు.
అమ్మాయిలతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు తన డేరా వైపు భక్తులను రానిచ్చేవాడు కాదని ఆయన అన్నారు. ఏకాంతంగా యువతులతో గడిపినప్పుడు అత్యవసరం అంటూ ఎవరైనా వస్తే, బాబా ధ్యానంలో ఉన్నారని చెప్పమనేవాడని ఆయన చెప్పారు. ధ్యానంలో ఉన్నాడని చెప్పినందుకైనా ఆయన ఏనాడూ ధ్యానం చేసిన పాపాన పోలేదని తెలిపారు. ఒకసారి గుర్మీత్ అనుభవించిన అమ్మాయి ఆ దరిదాపుల్లో కనిపించేందుకు అంగీకరించేవాడు కాదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేది ఆయన దత్తపుత్రికగా ప్రపంచానికి చూపిన హనీప్రీత్ సింగ్ అని ఆయన అన్నారు.
మరోవైపు తనకు 20 ఏళ్ల శిక్ష విధించడంపై డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. 1999లో అత్యాచార సంఘటన జరిగితే, వారి స్టేట్మెంట్ను 2005లో సీబీఐ రికార్డు చేసిందని విశాల్ పేర్కొన్నారు. అలాగే బాధితులు చెప్పిన విషయాల్లో కొన్నింటిని సీబీఐ కోర్టు దాచి పెట్టిందని బాబా తరఫు న్యాయవాది విశాల్ గార్గ్ నర్వానా చెప్పారు. అంతేకాకుండా బాధితులకు ఎలాంటి మెడికల్ పరీక్షలను కోర్టు నిర్వహించలేదని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని విశాల్ పేర్కొన్నారు.