ఏపీ టాప్…ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు

257
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రజాప్రతినిధుల కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. ఈమేరకు లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్‌ అండ్ ట్రైనింగ్‌ (డీఓపీటీ) శాఖ మంత్రి జిత్రేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017-2021 మధ్య కాలంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 సీబీఐ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానంలో  ఆరు కేసులతో ఉత్తరప్రదేశ్‌, కేరళ నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో 5కేసుల చొప్పున నమోదు అయ్యాయని వెల్లడించింది.

తమిళనాడులో నాలుగు కేసులు కొత్తగా వచ్చినట్టుగా పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 22 కేసుల్లో ఛార్జిషీట్‌లు దాఖలు చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసులలో 2017లో 66.90శాతం శిక్ష రేటు నమోదు కాగా, 2018లో 68శాతం, 2019లో 69.19 శాతం, 2020లో 69.83శాతం, 2021లో 67.56శాతంగా ఉన్నట్టు డీఓపీటీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి…

నాటి కలలు…నేడు నిజాలు:సీఎం

దేశంలోనే నెంబర్ వన్ ” హైదరాబాద్ ” !

షర్మిల బీజేపీ వదిలిన బాణం.. నిజమేనా ?

- Advertisement -