షర్మిల బీజేపీ వదిలిన బాణం.. నిజమేనా ?

400
- Advertisement -

టి‌ఆర్‌ఎస్ నేతలపై కే‌సి‌ఆర్ పాలనపై ఘాటు విమర్శలు చేస్తూ ఈ మద్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలిటికల్ హిట్ ను పెంచుతోన్న సంగతి తెలిసిందే. టి‌ఆర్‌ఎస్ నేతలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా షర్మిల పాదయాత్రలో భాగంగా ఆయా నియోజిక వర్గాలలోని టి‌ఆర్‌ఎస్ ఎమ్మెలేలను టార్గెట్ చేస్తూ.. టి‌ఆర్‌ఎస్ నేతలు తాలిబన్లు అని, అవినీతి పరులని, కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఇలా రకరకాల విమర్శలతో పోలిటికల్ హిట్ పెంచుతున్నారు షర్మిల.

అయితే వీటికి ఆధారాలు ఉన్నాయా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు.. ప్రజలు చెప్పారు.. వార్తలు వచ్చాయి అందుకే అంతున్నానని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ షర్మిల. కాగా ఈవిధంగా షర్మిల నిరాధారమైన ఆరోపణలు, దారుణమైన విమర్శలు చేయడంలో రాజకీయకుట్ర దాగి ఉందనేది టి‌ఆర్‌ఎస్ నుంచి వినిపిస్తున్న మాట. పాదయాత్రలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హింసను ప్రేరేపిస్తూ, ఆమె అనుసరిస్తున్న వ్యూహాల వెనుక బీజేపీ హస్తం ఉందనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఇటీవల షర్మిల చుట్టూ చోటు చేసుకున్నా పరిణామాలను గమనిస్తే.. ఇదే విషయం స్పష్టమౌతోందనేది కొందరి అభిప్రాయం.

తనపై దాడి జరిగిందని షర్మిల పదే పదే చెబుతున్నప్పటికి, ఇతర పార్టీల నుంచి ఏ నేతలు కూడా సానుభూతి తెలిపే ప్రయత్నం చేయలేదు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే తన సొంత అన్న అయిన ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు. కనీసం వైసీపీ పార్టీ తరుపున నేతలు ఎవరు స్పందించకపోగా ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా స్పందించారు. కానీ తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం షర్మిల కు భారీగా మద్దతు పలికారు. టి‌ఆర్‌ఎస్ నేతల దాడిని ఖండిస్తూ షర్మిల కు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా ఈ పరిణామాలపై ప్రధాని మోడి కూడా షర్మిలతో పోన్ లో పరామర్శించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవ్వని చూస్తుంటే బీజేపీ వైతెపా పార్టీల మద్య రహస్య ఒప్పందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -