దర్శకుడు ఆదిత్య దర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద అద్భుత రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన 15 రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి టాప్ ఇండియన్ సినిమాల జాబితాలో చోటు సంపాదించింది.
15 రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే..భారత్‌లో (నెట్): ₹937.32 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా: ₹1,492.17 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4వ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
ప్రస్తుతం ఉన్న టాప్ గ్రాస్ చిత్రాలు.. దంగల్ రూ.2,070 కోట్లు, బాహుబలి 2.. రూ.1,810.60 కోట్లు, పుష్ప 2 రూ.1,742.10 కోట్లు,ధురంధర్ 2 – ₹1,492.17 కోట్లు (రన్నింగ్) చేసింది.
మొదటి వారం భారీగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో వారం కొంత తగ్గుదల చూపించింది.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!

