దేశంలో 5కు చేరిన ఒమిక్రాన్ కేసులు..

209
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా కొద్దీ జనాలలో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. కాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు బయటపడగా.. తాజాగా మరొక కేసు నమోదైంది. ఇప్పటికే బెంగళూరులో 2, గుజరాత్‌లో 1, మహారాష్ట్రలో ఒక కేసు నమోదవగా.. ఇప్పుడు ఢిల్లీలోనూ మరో కేసు వచ్చింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు.

ఒమిక్రాన్ ఉన్నట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేర్పించామని, వారిపై నిఘా పెట్టామని తెలిపారు. అందరికీ చికిత్స చేస్తున్నామన్నారు. కాగా, ఇవాళ సౌదీ నుంచి నాగ్ పూర్ కు వచ్చిన ఎయిర్ అరేబియా ఫ్లైట్ లోని 95 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. కాగా, వ్యాక్సినేషన్ ను పుదుచ్చేరి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రజారోగ్య చట్టం ప్రకారం ఉత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -