యాంకర్ అనసూయ ఇంట విషాదం..!

31

ప్రముఖ టాలీవుడ్‌ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. అనసూయ తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో మరణించారు. ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన.. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అనసూయ కన్నీరు మున్నీరైపోయింది. హైదరాబాద్ తార్నాకలో అనసూయ పేరెంట్స్ ఉంటారు. అక్కడే కొన్నేళ్లుగా ఉంటున్నారు వాళ్లు. సుదర్శన్ రావు తన సొంత నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. తండ్రి మరణంతో యాంకర్ అనసూయ తీవ్రం విషాదంలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసినప్పటి నుంచి కన్నీరు పెడుతూనే ఉంది ఈమె.

పలువురు జబర్దస్త్ నటులతో పాటు సినీ ప్రముఖులు కూడా అనసూయ భరద్వాజ్ ఇంటికి చేరుకుంటున్నారు. నాగబాబు, రోజా కూడా అనసూయకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. వాళ్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుదర్శన్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఇండస్ట్రీలోని ప్రముఖులు అనసూయకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. తమ సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.