పార్టీల గుర్తులు సొంత ఆస్తి కాదు!

138
delhi high court
- Advertisement -

రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల గుర్తుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జకీయ పార్టీలకు కేటాయించిన గుర్తులు వాటి సొంత ఆస్తి కాదని, ఎన్నికల్లో ఏదైనా పార్టీ పనితీరు ఘోరంగా ఉంటే.. ఆ పార్టీ గుర్తును కోల్పోతుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది.

ఎన్నికల గుర్తు అనేది స్థిరమైనది కాదని, అది ఎలాంటి సంపదను సృష్టించదని వెల్లడించింది. రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను సొంత ఆస్తిలా భావించకూడదని..ఏదైనా పార్టీ పనితీరు దారుణంగా ఉంటే ఆ గుర్తు కోల్పోతుందని 1968 నాటి ఎన్నికల గుర్తుల ఉత్తర్వుల్లో ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

2004లోనే సమతా పార్టీకి గుర్తింపు పోయిందని తెలిపింది. ఎవరికైనా గుర్తును కేటాయించే హక్కు ఎన్నికల కమిషన్‌కు ఉంటుందని తెలిపింది. కాగడా గుర్తును శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించడాన్ని సవాలు చేస్తూ సమతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను సింగిల్ జడ్జి కొట్టేయగా, ఆ పార్టీ మళ్లీ అప్పీలు చేసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ సందర్భంగా ఎన్నికల గుర్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -