రైతు ఉద్యమం..కంగనా- తాప్సీ మధ్య వార్‌..!

129
kangana
- Advertisement -

రైతుల ఉద్యమం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ – తాప్సీ మధ్య చిచ్చురేపింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో ఉంది రైతులు కాదు టెర్రరిస్టులు అని కంగనా వ్యాఖ్యానించగా దీనిపై పరోక్షంగా ట్వీట్ చేసింది తాప్సీ. మీ విలువలను, వ్యవస్థను బలపరిచేందుకు మీ పని మీరు చెయ్యాలి తప్ప ఇతరులకు పాఠాలు నేర్పే టీచర్‌గా మారొద్దని సూచించింది.

దీనిపై స్పందించిన కంగనా…బీ గ్రేడ్‌ మనుషులకు బీ గ్రేడ్‌ ఆలోచనలే వస్తాయి. వారి ఉచిత సలహాలను వినకండి. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను అంటూ పేర్కొంది.

దీనికి రిప్లై ఇచ్చిన తాప్సీ …..విషం వారి డీఎన్ఏలోనే ఉండొచ్చు. ఆర్ఎన్ఏ, ప్లేట్‌లెట్స్‌పై కూడా అని పేర్కొంది.

- Advertisement -