కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన 100వ రోజుకు చేరుకుంది. పలు దఫాలుగా కేంద్రంతో రైతులు చర్యలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. మరోవైపు ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయించాయి రైతు సంఘాలు.
ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైవేల దిగ్బందనం కొనసాగనుండగా రాజస్థాన్ సరిహద్దుల్లో “కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే” దిగ్బంధం చేశారు రైతులు. అలాగే ప్రజలు ఇంటివద్ద నలజెండాలు ఎగురవేయాలని పిలుపు నిచ్చాయి రైతు సంఘాలు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలతో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. అలాగే ఈనెల 10న ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 15న కార్మికులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు రైతులు. మొత్తంగా రైతులు చేపట్టిన ఆందోళన మరింత ఉదృత రూపం దాల్చనుంది.