సీఎం కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష..

133
kejriwal
- Advertisement -

ఆపరేషన్ లోటస్‌కు చెక్ పెట్టేందుకు సీఎం కేజ్రీవాల్ ఇవాళ సొంత ప్రభుత్వంపై విశ్వాస పరీక్షకు దిగారు. ఇవాళ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుండగా బలపరీక్ష నిరూపించుకోనున్నారు కేజ్రీవాల్.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 ఎమ్మెల్యేలకుగాను ఆమ్‌ ఆద్మీ పార్టీకి 63 మంది సభ్యుల బలం ఉన్నది. కేజ్రీవాల్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం సులభంగా మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉందని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ పీడీటీ ఆచార్య అన్నారు.

ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, అవినీతి పేరుతో తమ నాయకులను కొనేందుకు బీజేపీ.. ఆపరేషన్‌ లోటస్‌ చేపట్టిందని సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఆప్‌ ఎమ్మెల్యేలు కమలం పార్టీ ప్రలోభాలను లొంగరని నిరూపించేందుకు సోమవారం అసెంబ్లీ ముందుకు విశ్వాస తీర్మానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ బలపరీక్ష ద్వారా ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ కీచడ్ (బురద)గా మారనుందని చెప్పారు.

- Advertisement -