Kejriwal:జైలు నుండే రెండో ఆదేశం

22
- Advertisement -

జైలు నుండే పాలన చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే తొలిసారి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేస్తుండగా తాజాగా ఇవాళ ఉదయం ఆరోగ్య శాఖకు సంబంధించిన రెండో ఆదేశాలు జారీ చేశారు కేజ్రీ.

కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాకు చదివి వినిపించారు. జైలులో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఢిల్లీలోని కొన్ని ఆస్పత్రుల్లో, మొహల్లా క్లినిక్​ల్లో ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో లేవు. వాటిని అందుబాటులో ఉంచాలని సూచించారని తెలిపారు.

ఇక కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు కూడా నిర్వహించడం లేదని…ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు.

Also Read:Kavitha:కడిగిన ముత్యంలా బయటకువస్తా

- Advertisement -