కవితకు 14 రోజుల రిమాండ్..

14
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను 14 రోజుల జ్యూడిషియల్ కస్టడికి అనుమతించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది. ఇక తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు కవిత తరపు న్యాయవాది. వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని, అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కవిత. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు.

Also Read:Kavitha:కడిగిన ముత్యంలా బయటకువస్తా

- Advertisement -