చెన్నైపై ఢిల్లీ గెలుపు..

271
Delhi
- Advertisement -

శనివారం ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్,ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడాయి.తొలి మ్యచ్‌లోనే చెన్నై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన, 188 పరుగులు చేయగా, లక్ష్యం భారీగా ఉన్నా, యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సునాయాసంగా ఛేదించింది. తన పునరాగమనంలో సురేశ్ రైనా దూకుడు కనబరిచి, 36 బంతుల్లోనే 54 పరుగులు చేయగా, మొయిన్ అలీ 24 బంతుల్లో 36, శ్యామ్ కరన్ 15 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరునే అందించారు.

ఆపై 189 పరుగుల లక్ష్యంతో ఢిల్లీలో బరిలోకి దిగిన ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి, చెన్నై బౌలర్లను దుమ్ములేపారు. ధావన్ 54 బంతుల్లో 85, పృధ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులు చేయడంతో, అప్పటికే ఢిల్లీ విజయం ఖరారైంది. ఆపై వారు అవుట్ అయినా, మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను పూర్తి చేశారు. చివర్లో పంత్, (15 పరుగులు) స్టోయినిస్ (14 పరుగులు)లు జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా, నేడు చెన్నై వేదికగా, రాత్రి 7.30 గంటల నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

- Advertisement -