మొన్న ప్రభాస్, నిన్న కోహ్లి, నేడు దీపిక పడుకోన్. ఇదేంటి అనుకుంటున్నారా అదేనండి లుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న మైనపు విగ్రహాలు. ఒకప్పడు తమకు ఇష్టమైన హీరోయిన్లు, హరోలు, రాజకీయ నాయకులకు గుడి కట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విగ్రహాలకు బదులు మైనపు బొమ్మలను మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. దినికి ఒక బ్రాంచ్ కూడా పెట్టేశారు. లుస్సాడ్స్ మ్యూజియం. ఇంతకుముందు లండన్ లో హెడ్ ఆఫీస్ ఉండా ఇప్పుడు కొత్తగా బ్యాంకాక్ లో ఓపెన్ చేశారు.
లండన్ లో చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇతంకు ముందు ప్రభాస్ విగ్రహం బ్యాంకాక్ లో దర్శనమివ్వగా ఇప్పుడు దీపికా పదుకోన్ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ లో ప్రదర్శించారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతన్న దీపికా ఇటివలే హాలివుడ్ లో కూడా ఒక సినిమా చేయడంతో ఆమె విగ్రహాన్ని కూడా లండన్ లో పెట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు టుస్సాడ్ మైనపు బొమ్మల తయారీ నిపుణులు దీపికను కలిశారు. ఆమె ముఖ కవలికలు, శరీర కొలతలు తీసుకున్నారు. మరో నెలరోజుల్లో బొమ్మ రెడీ అయిపోతుంది. ఇప్పటికే లండన్ లో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు మాధురీ దీక్షీత్, కత్రినాకైఫ్, కరీనా కపూర్ ల విగ్రహాలు ప్రదర్శించారు. ప్రస్తుతం దీపికా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది.