హ్యాపి బ‌ర్త్ డే కేటీఆర్…

776
ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని రాష్ట్ర‌మంత‌టా ప‌లువ‌రు టీఆర్ఎస్ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఉద్య‌మ నేత‌, యువ‌త‌కు స్ఫూర్తి నిచ్చిన కేటీఆర్ కు ప‌లువురు త‌మ‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుకుంటున్నారు. ఇక ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, సెల‌బ్రెటీలు మంత్రి కేటీఆర్ కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే విషెష్ చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాష్ట్రంలో ప‌ల‌వురు అన్న‌దానాలు, ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌వ‌ద్ద‌ని, ప్లెక్సిలు ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని త‌న అభిమానులకు సూచించారు మంత్రి కేటీఆర్.

ktr

ఈసంద‌ర్భంగా హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్ లు పాట‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చయిత కందికొండ పాట రాయ‌గా ప్ర‌ముఖ గాయ‌కుడు కైలాశ్ ఖ‌ర్ పాట‌ను పాడారు. ప్ర‌స్తుతం తెలంగాణ మొత్తం ఈపాట మార్మోగిపోతుంది.

- Advertisement -