డిసెంబర్ 25న శోభన్ బాబు సేవా సమితి అవార్డ్స్ ..

234
shoban
- Advertisement -

మరపురాని నటులు.. ఆంధ్రుల అందగాడు.. కుటుంబకథా చిత్రాల కథానాయకుడిగా ఎవర్గ్రీన్ అనిపించుకున్న నటులు శోభన్ బాబు. నటుడిగా క్రేజ్ ఉండగానే తనకు తానుగా సినిమా జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించుకుని, దాన్ని తూచా తప్పకుండా ఆచరించిన క్రమశిక్షణ కలిగిన ఆయన వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. సినిమాల నుంచి ఆయన తప్పుకున్నప్పటికీ నేటికీ ఆయన అభిమానులు ‘శోభన్ బాబు సేవాసమితి’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించడం గర్వించదగ్గ విషయం. తాజాగా ‘శోభన్ బాబు సేవా సమితి’ శోభన్ బాబు పేరుపై సినీ పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కారాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనెల 25న తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవాన్ని భారీ ఎత్తున హైదరాబాద్ లోని ‘ఎన్ కన్వెన్షన్’లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులు, విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అందించడానికి ఆదివారం హైదరాబాద్ లోని ఎబోనీ హెూటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నటులు, ఎంపీ మురళీమోహన్ గారు, పరుచూరి వెంకటేశ్వరరావుగారు, గోపాలకృష్ణగారు, రేలంగి నరసింహారావుగారు, రాశీ మూవీస్ నరసింహారావుగారు, సంపూర్ణేష్ బాబు గారు, శేష్ట రమేష్ బాబుగారు తదితరులు విచ్చేశారు.

ఈ సందర్భంగా మురళీమోహన్గారు మాట్లాడుతూ.. శోభన్ బాబు గారు గొప్ప వ్యక్తిగా.. నిర్మాతలకు సహకరించిన గొప్ప హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నిత్య చిరంజీవి. ఆయన ఎంత సిన్సియర్ గా ఉండేవారో.. ఆయన అభిమానులు కూడా అదే సిన్సియారిటీని ఫాలో అవుతూ ఇప్పటికీ ఆయన అభిమానులుగానే కొనసాగుతూ ఉన్నారు. మా ‘అతడు’ సినిమాలో ఆయన్ను నటింప చేయడానికి చాలా ప్రయత్నించాను. బ్లాంక్ చెక్ కూడా పంపాము. అయినా దాన్ని సున్నితంగా తిరస్కరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావుగారు మాట్లాడుతూ.. అభిమానుల అందరూ కలిసి శోభన్ బాబు గారి పేరిట అవార్డులు నిర్వహిస్తుండడం నిజంగా ఆయనకు నివాళి. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాం.

సంపూర్ణేష్ బాబుగారు మాట్లాడుతూ.. ఇంతమంది పెద్ద అతిథుల పక్కన నాకు కూడా చోటు కల్పించడం నాకు హ్యాపీగా ఉంది. శోభన్ బాబుగారు వంటి మహెూన్నతమైన వ్యక్తిని నేను కలవలేక పోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

- Advertisement -