పాప బ’డే కోసం…1,10,000 పానీపూరీలు పంచాడు ఓ తండ్రీ

38
panipuri
- Advertisement -

ఒకప్పుడు కూతుళ్లు పుడితే వారిని చంపేసివారు లేదంటే ఎక్కడో చెత్త బుట్టల్లో పడేసివారు. కానీ ఇప్పుడు కాలం మారింది మనుషుల్లో మార్పులు వస్తున్నాయి. కేంద్రం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం మరియు సేల్ఫీ విత్‌ డాటర్‌ లాంటి కార్యక్రమం ద్వారా ఆడపిల్లలను పెంచి పోషిస్తున్నారు. దీనికి తోడు సుకన్య సంవృద్ది యోజన ద్వారా కూడా ప్రజల్లో తల్లిదండ్రుల్లో మార్పులు తీసుకురావడం గొప్ప శుభసూచకం. తాజాగా మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లోని కోలార్‌ వీధిలో ఆంచల్‌ గుప్త అనే వ్యక్తి తన కూతురు పై ప్రేమను పానీపూరీతో పంచాడు. తన కూతురు పుట్టిన రోజు సదర్భంగా రోజంతా ప్రజలకు ఉచితంగా పానీపూరీ తినిపించాడు ఒకటి కాదు రెండు ఏకంగా లక్ష పదివేల పానీపూరీలను ప్రజలకు పంచాడు.

అంచల్‌కు మొదటి సంతానంలోనే ఆడపిల్ల పుట్టాలని ఆ దేవుడిని కోరుకున్నాడు. కానీ మొగపిల్లాడు పుట్టాడు. ఆపై రెండో సంతానంగా 2021ఆగస్టు17న కుమార్తె పుట్టింది. దాంతో ఆంచల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజున పెద్ద పండగలా చేద్దామనుకున్నాడు. కానీ కరోనా వల్ల ఏటువంటి కార్యక్రమాలు చేయలేదని మీడియాతో చేప్పారు. కానీ 2022నాటి మొదటి పుట్టిన రోజున మాత్రం…1,10,000 ఉచిత పానీపూరీలు ప్రజలకు పంచాడు. బుధవారం రోజున బోపాల్‌లో 31స్టాల్స్‌ ద్వారా ఒక లక్ష పదివేల ఉచిత పానీపూరీలు పంపిణీ చేశారు. పానీపూరీ తిన్న ప్రజలు చిన్నారి బాగుండాలని దీవెనలు అందించారు. దాంతో ఆంచల్‌ తెగ ఆనందపడిపోయారు. ఈ న్యూస్‌ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఆడపిల్ల అంటే ఇష్టమని, ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించేందుకే ఖర్చుకు ఏమాత్రం వెనకాడబోమని ఆంచల్‌ గుప్త తెలిపారు. ఆడబిడ్డ పుట్టడంతో నా కల నిజమైంది. నాకు పెళ్లయినప్పటి నుంచి ఎప్పుడూ కూతురే పుట్టాలని అనుకునేవాడిని. కానీ రెండేళ్ల క్రితం నాకు కొడుకు పుట్టాడు. అనంతరం కూతురు పుట్టింది. కూతుళ్లతోనే భవిష్యత్తు సాధ్యమవుతుందని నేను నమ్ముతా’ అని ఆంచల్ మీడియాతో చెప్పారు.

- Advertisement -