మహాత్ముని బొమ్మ లేకుండా కొత్తనోట్లు

94
Rs 2000 notes sans image of Mahatma Gandhi

కొత్త నగదు నోట్లతో ఓవైపు సామాన్యులు అష్టకష్టాలు పడుతుండగానే రెండు వేల నోటు పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో రెండు వేల నోటు మీద తప్పుగా అక్షరాలను ముద్రించారని ప్రచారం జరిగింది. తాజాగా గాంధీ బొమ్మ లేని రెండు వేల డినామినేష‌న్ నోట్లు ఓ రైతు చేతికి చిక్కాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలోని ఓ ఏజెన్సీ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోట్లు తీసుకున్నారు. బిచ్చుగ‌వాడి గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌ణ్ మీనా అనే రైతు ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఆరు వేల విత్‌డ్రా చేసుకున్నాడు. అయితే, తొలుత కొత్త నోట్లేగా చూసుకోవాల్సిన పనేముందనుకొని ఇంటికెళ్లారు. అయితే ఇంట్లో ఆ నోట్లు చూసిన ఆయ‌న కొడుకు ఆ కొత్త నోట్లు న‌కిలీవంటూ తేల్చేశాడు. గాంధీ బొమ్మ‌లేని కార‌ణంగా బ్యాంక్ ఇచ్చిన కొత్త నోట్లు ఫేక్ అంటూ అభిప్రాయ‌ప‌డ్డాడు. దాంతో హుటాహుటిన ల‌క్ష్మ‌ణ్ మీనా బ్యాంక్‌కు వెళ్లి జ‌రిగిన విష‌యాన్ని చెప్పాడు.

Rs 2000 notes sans image of Mahatma Gandhi

అయితే బ్యాంకు అధికారులు మొదట్లో రైతు చెప్పిన విష‌యాన్ని మొదట్లో కొట్టిపారేశారు. కానీ ఇంతలోనే మరో రైతుకు ఇదే సమస్య ఎదురైంది. చివరకు రైతుల నుంచి రెండు వేల నోట్ల‌ను తీసుకున్న బ్యాంక్ అధికారులు వాళ్ల‌కు కొత్త నోట్ల‌ను ఇవ్వ‌లేదు. నోటుపై గాంధీ బొమ్మ కోసం ఉంచిన స్థ‌లంలో ఆ బొమ్మ ముద్ర‌ణ‌కాలేద‌ని, ఆ నోట్ల‌ను ప‌రిశీల‌న కోసం ఆర్బీఐకి పంపిన‌ట్లు అధికారి శర్వన్ లాల్ మీనా తెలిపారు. దొంగనోట్లు ముద్రించే వాళ్లు తప్పు చేశారంటే నమ్మొచ్చు.. కానీ, ఆర్బీఐ కూడా తప్పు చేసిందంటే నమ్మగలమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.