డేటా..ఆక్సిజన్‌ లాంటిది : ముఖేష్ అంబాని

222
Data is the oxygen for a digital economy: Mukesh Ambani
- Advertisement -

డేటా వినియోగాన్ని అందరికీ కల్పించే లక్ష్యంతో తమ సంస్థ పని చేస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అన్నారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది ఓ కొత్త ఇందనమని, ఆక్సిజన్ లాంటిదని వెల్లడించారు.

ఈ రోజు నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్న ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో నూతన విధానాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచేయాలని, దేశీయంగా పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని అన్నారు.

  Data is the oxygen for a digital economy: Mukesh Ambani

ప్రతి భారతీయుడికీ సాంకేతికతలో అవగాహన కల్పిస్తే, దేశంలో లక్షల సంఖ్యలో స్టార్టప్ లు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాలను భారత్ ఉపయోగించుకోలేకపోయిందని చెప్పిన ముఖేశ్, నాలుగో పారిశ్రామిక విప్లవం.. ముఖ్యంగా డిజిటల్ యుగం నుంచి ప్రయోజనాలను పొందేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

అంతేకాకుండా అందుబాటు ధరల్లో డేటా ఆఫర్లు అందిస్తున్నామని, ఇందుకోసం తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లోకి తీసుకొచ్చామని చెప్పారు. డేటాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మన దేశానికి లేదని, ప్రస్తుతం ఈ డేటా టూల్స్ తో 1.3 బిలియన్ల ఉద్యోగాలిచ్చి పని చేయించాల్సిన అవసరం ఉందని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.

- Advertisement -