Daska Dhamki:మూడు రోజుల కలెక్షన్స్

137
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. తొలి రోజే 8 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా మూడు రోజులకి గానూ 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హి అనిపించుకుంది. ఉగాది సెలవలు కలిసి రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు అందుకుంటుంది.

ఇక వీకెండ్ ఈ సినిమా ఇంకా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. విశ్వక్ కి యూత్ లో ఉన్న క్రేజ్ తో ధమ్కీ అన్ని ఏరియాల్లో మంచి అక్యూపెన్సీ చూపిస్తుంది. వీకెండ్ దాటాక ఈ సినిమా ఇరవై కోట్ల గ్రాస్ దాటేసే ఛాన్స్ ఉంది. సినిమాలో కామెడీ , సాంగ్స్ , సెకండాఫ్ ట్విస్టులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమా మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కలెక్ట్ చేస్తుంది.

వన్మయి క్రియేషన్స్ పై రాజు నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. రావు రమేష్ , మహేష్ ఆచంట , హైపర్ ఆది ముఖ్య పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -