BRS Party:నాందేడ్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ..

55
- Advertisement -

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని లోహా టౌన్‌లో ఇవాళ బీఆర్ఎస్ భారీ బహిరంగసభ జరుగనుంది. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్‌, లోహా పట్టణాలు గులాబీమయమయ్యాయి. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో సుందరంగా తీర్చిదిద్దారు.

సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్‌ఎస్‌ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్‌ బజార్‌ సభాప్రాంగణానికి చేరుకుంటారు.

తొలుత మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేతోపాటు కిసాన్‌ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌రావు కదం, హర్షవర్ధన్‌ జాధవ్‌, సురేశ్‌ గైక్వాడ్‌, యశ్‌పాల్‌ బింగే, నాగ్‌నాథ్‌ గిస్సేవాడ్‌ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ పట్వారీ, ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు దగ్దా పవార్‌, ఛత్రపతి శివాజీ మరాఠా నవయువక్‌ మండల్‌ ప్రెసిడెంట్‌ మదన్‌ జాధవ్‌, స్పోర్ట్స్‌ కన్వీనర్‌ దిలీప్‌ కుమార్‌ జగ్టప్‌, సతీశ్‌ నల్గే, సతీశ్‌ షిండే, ప్రహ్లాద్‌ రాకోండే, వార్దా మాజీ ఎమ్మెల్యే వసంతరావు బోండే, ఎన్సీపీ స్టేట్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ శివరాజ్‌ దోండ్గే, లక్ష్మణ్‌రావు వోంగేతోపాటు నాందేడ్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నేతల నేతృత్వంలో పలువురు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, సీనియర్‌ రాజకీయ నేతలు పార్టీలో చేరనున్నారు. వారికి సీఎం కేసీఆర్‌ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -