ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన దామోద‌ర్ రావు..

130
dhamodhar rao
- Advertisement -

రాజ్య‌స‌భ ఎంపీలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, మరియు హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి . రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య‌నాయుడు వీరిచేత ప్ర‌మాణం చేయించారు.

జ‌గిత్యాల జిల్లా బుగ్గారం మండ‌లం మద్దునూరుకు చెందిన దీవ‌కొండ దామోద‌ర్ రావు తెలంగాణ ఉద్య‌మం ప్ర‌స్థానంలో తొలినాళ్ల నుంచి నేటి ముఖ్య‌మంత్రి.. నాటి ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెంట న‌డిచిన వ్య‌క్తుల్లో ఒక‌రు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ప‌లు హోదాల్లో ప‌ని చేశారు. తెలంగాణ ప‌బ్లికేష‌న్స్‌ (న‌మ‌స్తే తెలంగాణ‌, తెలంగాణ టుడే దిన‌ప‌త్రిక‌లు) కు చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

- Advertisement -