- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తెలంగాణ భవన్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ సోమా భరత్ కుమార్.
ఈ సందర్భంగా సోమ భరత్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని అన్నారు.తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -