కేరళను కుమ్మేస్తున్న తౌటే..

175
cyclone
- Advertisement -

ఓ వైపు కరోనా మరోవైపు తౌటే తుపాన్ ఐదు రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది. ఇప్పటికే తౌటే తుపాన్ కేరళను తాకగా తుపాను తాకిడికి కేరళ అతలాకుతలం అవుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. తౌటే తుపాన్ ప్రభావం ఎక్కువగా కేరళ రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇడుక్కి, పాలక్కాడ్‌, మల్లాపురం, త్రిశూర్‌, కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూరు, కాసరఘడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్డీఆరఎఫ్, సహాయక బృందాలు మోహరించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. త్రిశూర్‌లో చాలా గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికే తుపాను తాకిడి ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు అధికారులు.

ఉత్తర దిశగా..గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. సాయంత్రం 5.30గంటలకు తీవ్ర తుపాన్ గా మారనుంది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా..220 కి.మీటర్లు, ముంబైకి దక్షిణ నైరుతి దిశగా..590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగ బలపడి రాగల 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా తౌటే మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గుజరాత్ తీరం పోర్ బందర్ – నలియాల మధ్య ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం లేదా సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

- Advertisement -