ప్ర‌తిఒక్క‌రు భౌతిక దూరం పాటించాలి: మంత్రి సత్యవతి

139
minister
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ రోజుతో ఐదో రోజు చేరింది. ప్రజల సహకారంతో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం మ‌హ‌బూబూబాద్ జిల్లాలో లాక్‌డౌన్ అమ‌లు తీరును మంత్రి సత్యవతి రాథోడ్ ప‌రిశీలించారు. మ‌హ‌బూబాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని వ్యాపారులకు సూచించారు.

అనంతరం మోడల్ మార్కెట్ నిర్మించే స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈనెల 12 నుంచి 10 రోజుల‌పాటు అమ‌లులో ఉండ‌నుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిరోజు 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌లు అమలులో ఉంటాయి. ఉద‌యం 6 గంటల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల కొనుగోలుకు అవ‌కాశం క‌ల్పించారు.

- Advertisement -