తీవ్ర తుపానుగా మారిన నిసర్గ..

305
Cyclone Nisarga
- Advertisement -

అరేబియ మహాసముద్రంలో ఏర్పడిన నిసర్గ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ముంబైకి దక్షణ నైరుతి దిశగా 165 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 395 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

ప్రస్తుతం తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఈ తుపాను మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది.

తుపాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుపాన్‌ ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతాయని.. చెట్లు నేలకూలే ప్రమాద ముందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర, గుజరాత్‌, దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్‌కు 33 ఎన్డిఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించారు. తీర ప్రాంతాల్లోని 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా ముంబైలో 144 సెక్షన్ విధించారు. ముంబై తీరంలో ప్రజల రాకపోకలను నిషేధించింది ప్రభుత్వం.

గుజరాత్ తీర ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కాగా, తుఫాను ప్రభావంతో ఇప్పటికే ముంబైతోపాటు ఇతర తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి

- Advertisement -