తీరం దాటిన బిపర్‌జాయ్‌..

33
- Advertisement -

గుజరాత్‌ను బిపర్ జాయ్ అతలాకుతలం చేసింది. గురువారం రాత్రి తీరాన్ని తాకిన బిపర్ జాయ్ ధాటికి ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. కాసేపటి కిత్రం గుజరాత్​లో తీరం దాటడంతో బిపర్జాయ్​ తుపాను తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది.

భారీ వర్షాల కారణంగా గుజరాత్​లో 500కుపైగా చెట్లు నేలకూలాయి. 940కిపైగా గ్రామాల్లో విద్యుత్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Also Read:వేడినీళ్లు.. చన్నీళ్లు.. ఏది బెటర్

భీకర గాలులతో కచ్‌ జిల్లాలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇక మోర్బీ జిల్లాలో భారీ వర్షాలు,ఈదురు గాలులకు తోడు కావడంతో ఇద్దరు మరణించగా, 22 మంది గాయపడ్డారు. తుఫాను తీరందాటిన ప్రాంత పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని సోమ్‌నాథ్‌ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Also Read:Curd:పెరుగుతో అందం

- Advertisement -