- Advertisement -
ఆదివారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన రేపు హైదరాబాద్ ముచ్చింతల్ లోని శ్రీ రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు రావద్దని పోలీసులు సూచించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన జారీ చేశారు.
- Advertisement -