స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) తెచ్చి వెస్ట్ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసేశారు అన్నారు కేటీఆర్. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారు.. ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయాడు అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో జూన్ 25 నుండి SIRను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలి అని కార్యకర్తలకు సూచించారు. SIR జరిగిన ప్రాంతాల్లో బీజేపీ వాళ్లకు పడవన్న ఓట్లు అన్ని తొలగించారు అని తెలిపారు.
27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించారని కోర్టులో కేసు వేశారు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారు అని షబ్బీర్ అలీ చెప్పింది నిజం.. ఆరోజు ఇదే మాట రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నాడు అని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశాడు అని ఆరోపించారు కేటీఆర్.
Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

