- Advertisement -
ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పౌరులకు హింస, సైబర్ దాడుల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అమెరికాలో ముప్పు వాతావరణం నెలకొని ఉందని… అమెరికా హోంమంత్రి శాఖ (DHS) తెలిపింది. ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతల కారణంగా సైబర్ దాడులు, హింసాత్మక చర్యలు, తీవ్రవాద కార్యకలాపాలు జరగొచ్చని పేర్కొంది.
ఇరాన్‌తో కొనసాగుతున్న వివాదం వల్ల అమెరికాలో ముప్పు వాతావరణం తీవ్రతరం అవుతోంది. ఇరాన్ అనుకూల హ్యాక్టివిస్టుల ద్వారా అమెరికా నెట్‌వర్క్‌లపై తక్కువ స్థాయి సైబర్ దాడులు జరిగే అవకాశముంది. అంతేగాక, ఇరాన్ ప్రభుత్వానికి చెందిన సైబర్ కార్యకర్తలు అమెరికా నెట్‌వర్క్‌లపై దాడులు చేసే అవకాశం ఉంది.
ఈ ఉద్రిక్తతలపై ప్రతీకార చర్యలుగా దేశీయంగా తీవ్రవాదులు స్వతంత్రంగా హింసకు పాల్పడే అవకాశాలు పెరగవచ్చు అని తెలిపారు అధికారులు.
Also Read:కొండా దంపతులపై చర్యలేవి!
- Advertisement -

