ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి!

7
- Advertisement -

ఇరాన్- ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణవాసులు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని తిరిగి తెలంగాణ రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

నిన్న రాత్రి ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు, ఇరాన్ నుంచి నలుగురు ఇండియా చేరుకున్నారు. ఈరాత్రికి ఇంకా 7గురు రావాల్సి ఉన్నట్లు దిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌లో విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఇంకా చాలామంది రావాల్సి ఉంది. దీనికోసం భారత విదేశాంగశాఖతో మంతనాలు జరుపుతున్నారు. ఇండియా చేరుకున్న వారందరికీ హాస్పిటాలిటీ, రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read:కొండా దంపతులపై చర్యలేవి!

- Advertisement -